Dharmavaram Politics: హాట్‌ హాట్‌గా అనంతపురం రాజకీయాలు.. ధర్మవరంపై కన్నేసిన ఆ ముగ్గురు..

|

Jan 07, 2022 | 7:26 AM

దావూద్ ఇబ్రహీం అని ఒకరు, కనీసం టికెట్‌ తెచ్చుకోమని ఇంకొకరు. అసలు ఏంటా స్టోరీ? అనంతపుర పాలిటిక్స్‌ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటాయి. తాజాగా ధర్మవరంలో హైవోల్టేజ్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి.

Dharmavaram Politics: హాట్‌ హాట్‌గా అనంతపురం రాజకీయాలు.. ధర్మవరంపై కన్నేసిన ఆ ముగ్గురు..
Dharmavaram War
Follow us on

Dharmavaram Politics: ఆ ముగ్గురి గురి ధర్మవరం పీఠంపైనే. అందుకే ఒకరిపై ఒకరు ఒంటికాలితో లేస్తున్నారు. దావూద్ ఇబ్రహీం అని ఒకరు, కనీసం టికెట్‌ తెచ్చుకోమని ఇంకొకరు. అసలు ఏంటా స్టోరీ? అనంతపుర పాలిటిక్స్‌ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటాయి. తాజాగా ధర్మవరంలో హైవోల్టేజ్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. ముగ్గురు నేతల మధ్య త్రిముఖ పోరు టాక్‌ ఆఫ్‌ ది సీమగా మారింది. అనంతపురం జిల్లాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంది ధర్మవరం. MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, బీజేపీ నాయకుడు సూర్యనారాయణ మధ్య వార్‌ షురూ అయ్యింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఈ ముగ్గురూ పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తున్నారు. కేతిరెడ్డి టార్గెట్‌గా పరిటాల శ్రీరామ్ ఇటీవల చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారాయి.

తన అనుచరుల ద్వారా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, స్థలం కొనాలన్నా అమ్మాలన్నా ఎమ్మెల్యే అనుచరులకు కప్పం కట్టవలసిందేనని ఆరోపించారు శ్రీరామ్. తాజాగా బీజేపీ నేత సూర్యనారాయణ ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. ఏకంగా కేతిరెడ్డి అవినీతి కార్యక్రమాలపై సిరీస్‌లు రిలీజ్ చేస్తున్నారు సూరి. కేతిరెడ్డిని దావూద్ ఇబ్రహీంతో పోల్చారాయన. కొండలో వంద ఎకరాల్లో భవనాన్ని నిర్మించుకున్నారని, దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు రిలీజ్‌ చేశారు.

ఈ ఇష్యూపై గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు కేతిరెడ్డి. గాలి మాటలు చెప్పకుండా, ఆధారాలు ఉంటే చూపించాలంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే. కేతిరెడ్డి అంటేనే క్లీన్ అండ్ క్లియర్ అని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ధర్మవరంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.

ఇక్కడ ముగ్గురు నేతల ప్రయత్నం ఒక్కటే. ధర్మవరంపై ఆధిపత్యం సాధించడమే. గతంలో ఒకే పార్టీలో ఉన్న పరిటాల శ్రీరామ్, సూర్యనారాయణ మధ్య కూడా ఇదే పోరు నడిచేది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత సూర్యనారాయణ BJPలోకి వెళ్లడం, ఆ తరువాత పరిటాల శ్రీరామ్ బాధ్యతలు తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. కానీ సూర్యనారాయణ తిరిగి పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: Union Cabinet: గ్రీన్ ఎనర్జీ కారిడార్‌పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రెండోదశలో ఏపీ సహా 7 రాష్ట్రాల్లో ట్రాన్స్‌మిషన్ లైన్లు

Chandrababu: జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్రేజీ కామెంట్స్… లవ్ వన్ సైడ్ కాదంటూ…