అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను ప్రకటించారు. మొదట దుర్గమ్మను దర్శించుకుని మేనిఫెస్టోకు పూజలు చేయించిన ఆయన.. ఉండవల్లి ప్రజావేదికలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మేనిఫెస్టోను విడుదల చేశారు. మీ భవిష్యత్తు.. నా బాధ్యత అని మేనిఫెస్టోకు పేరుపెట్టారు. ప్రధానంగా రైతులు, సామాన్యులు, యువత, మహిళలకు ఈ మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
* రైతులు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపు
* వృద్ధాప్య పింఛన్‌దారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
* డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కొనసాగింపు
* ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షలకు పెంపు
* చంద్రన్న బీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
* పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు
* రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం
* రైతులకు పగటిపూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా
* రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
* వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి
* గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడి రాయితీలు
* నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంపు
* ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
* ఆదివాసుల కోసం ప్రత్యేక బ్యాంక్
* సముద్రం మీద వేటకు వెళ్లేవారికి క్రాప్ హాలిడేకి రూ.10వేలు
* 20 వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలన్నింటిలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు
* పేద కుటుంబాలకు పండుగల నాడు ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు
* ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పదేళ్లు కొనసాగింపు
* రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు
* కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ విదేశీ విద్య కోసం రూ.25 లక్షల ఆర్థిక సాయం.
* మాదిగ, రెల్లిలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
* రూ.10 వేల కోట్లతో బీసీల కోసం ప్రత్యేక బ్యాంకు
* ఏపీఐఐసీ ప్లాట్లలో 25 శాతం బీసీలకు రిజర్వేషన్
* స్వయం ఉపాధిలో భాగంగా ఇన్నోవా వంటి కార్ల కొనుగోలుకు 25 శాతం రాయితీ
* ప్రతి కుటుంబానికి రూ.20వేలు ఆదాయం కల్పించేలా చర్యలు
*చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి
* రాష్ట్రంలో 15,358 అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మాణం
* గిరిజన ప్రాంతాల్లో గర్భిణులకు ప్రత్యేక వైద్య సదుపాయం
* వర్గీకరణలో పెండింగ్‌లో ఉన్న కులాలకు న్యాయం జరిగేలా చూస్తాం
* చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా ఉచితం
* అన్ని అగ్ర కులాల్లోని పేదలకు న్యాయం చేస్తాం
* ఇస్లామిక్ బ్యాంకుకు ఏర్పాటు
* క్రిస్టియన్లకు ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం, శ్మశానాలకు స్థలాలు కేటాయించడం
* పాస్టర్లకు, ఇమామ్‌లకు, పూజారులకు ఉచితంగా ఇళ్లు
* దివ్యాంగులకు మూడు చక్రాల మోటారు వాహనం
* మానసిక వికలాంగులకు రూ.3 వేల పింఛను
* రూ.10 లక్షలలోపు పెట్టుబడి ఉంటే వడ్డీ లేని రుణాలు
* గ్రామాల్లో 2 వేల జనాభా ఉంటే భూగర్భ డ్రైనేజీ, సిమెంటు రోడ్లు, ప్రతి ఇంటికీ 70 లీటర్ల తాగునీరు
* మెగా టెక్స్‌టైల్ ప్లాంట్లలో 3 లక్షల ఉద్యోగాలు