ఆ నెంబర్ అంటే టిడిపి వణుకుతోందా ? ఏంటీ కథ ?

| Edited By: Pardhasaradhi Peri

Nov 06, 2019 | 3:00 PM

23 ఫీవర్‌ ఇప్పుడు టీడీపీని వణికిస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మే 23. టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 23. కానీ ఇందులో ఎంతమంది ఉంటారో..ఎంత మంది జంప్ అవుతారో అనే భయం టీడీపీ నేతల్లో మొదలైంది. ఇప్పటికే వల్లభనేని వంశీ ఝలక్‌ ఇచ్చారు. దీంతో ఆయన బాటలో నడిచే ఎమ్మెల్యేలు ఎవరు? అనే కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది. ఏపీలో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ వైపు […]

ఆ నెంబర్ అంటే టిడిపి వణుకుతోందా ? ఏంటీ కథ ?
Follow us on
23 ఫీవర్‌ ఇప్పుడు టీడీపీని వణికిస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మే 23. టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 23. కానీ ఇందులో ఎంతమంది ఉంటారో..ఎంత మంది జంప్ అవుతారో అనే భయం టీడీపీ నేతల్లో మొదలైంది. ఇప్పటికే వల్లభనేని వంశీ ఝలక్‌ ఇచ్చారు. దీంతో ఆయన బాటలో నడిచే ఎమ్మెల్యేలు ఎవరు? అనే కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది.
ఏపీలో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ వైపు నడుస్తుంటే…మరోవైపు జంప్‌ జిలానీలు కండువాల మార్పిడికి రెడీ అవుతున్నారు. అధికార పార్టీలోకి వెళ్లే నేతలెవరు? అనేది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాటలు కాకపుట్టిస్తున్నాయి.
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్‌తో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీలో ఒక సీనియర్‌ నేత తనను ఇబ్బంది పెట్టారంటూ…పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు వంశీ. అంతేగాకుండా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు కూడా చంద్రబాబుకు రాసిన లేఖలో తెలిపారు. వంశీ బయటకు రావడంతో మిగతా టీడీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? అనే చర్చ నడుస్తోంది.
తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిందే 23 మంది. వారిలో గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా రూట్లో ఉన్నారు. ఇంకా మిగిలింది 22 మంది. ఇందులో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు అనే విషయంపై పార్టీ నేతలు ఆరా తీయడం మొదలుపెట్టారు. 16 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అధికార వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. తమ పార్టీతో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు….మీరు రండి అంటూ జగన్‌ ఒక్క మాట అంటే చాలు వారంతా చంద్రబాబును వదిలేసి తమ పార్టీలోకి చేరిపోతారంటూ కామెంట్‌ చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.
ఇప్పుడు వైసీపీలో టచ్‌లో ఉన్న ఆ పదహారు మంది ఎవరంటూ టీడీపీలో ఉత్కంఠభరితంగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో అధికారం పోయిన కొద్ది కాలానికే టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యలు సైకిల్‌ దిగేసారు. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం చరిత్రలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎన్నడూ ఎదుర్కొనలేదు. ఇప్పుడు వచ్చినన్ని తక్కువ సీట్లు కూడా గతంలో ఎప్పుడూ రాలేదు. పైగా ఉన్నవారిలో పదహారు మంది జంప్‌ చేస్తే తెలుగుదేశానికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతోంది. ఏం జరుగుతుందో చూడాలి.