AP TDP : ఆనందయ్యను బెదిరించే వాళ్లని వదిలి, కుట్ర బహిర్గతం చేసిన సోమిరెడ్డిపై చీటింగ్, దొంగతనం కేసులా.? : అచ్చెన్న

|

Jun 06, 2021 | 11:41 PM

ఆనందయ్యను బెదిరించేవాళ్లని వదిలి, కుట్రను బహిర్గతం చేసిన సోమిరెడ్డిపై చీటింగ్, దొంగతనం, ఫోర్జరీ కేసులేంటని..

AP TDP : ఆనందయ్యను బెదిరించే వాళ్లని వదిలి, కుట్ర బహిర్గతం చేసిన సోమిరెడ్డిపై చీటింగ్, దొంగతనం కేసులా.? : అచ్చెన్న
Atchannaidu
Follow us on

Atchannaidu on Somireddy cases : మానవత్వంతో వైద్యసేవ చేస్తోన్న ఆనందయ్యను బెదిరించేవాళ్లని వదిలి, కుట్రను బహిర్గతం చేసిన సోమిరెడ్డిపై చీటింగ్, దొంగతనం, ఫోర్జరీ కేసులేంటని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు కాపాడే మందుతో వ్యాపారం చేయాలన్న నీచానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, వారిపై కేసు నమోదు చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. అనందయ్య అనుమతి లేకుండా వెబ్ సైట్ తయారుచేసి మందు ఒక్కో ప్యాకెట్ ను రూ.167కి అమ్ముకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాకాని అనుచరుడికి చెందిన శేశ్రిత టెక్నాలజీస్ అనే సంస్థ ఈ విధంగా అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు.

ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారిని వదిలేసి, ప్రశ్నిస్తున్న సోమిరెడ్డిపై కేసు నమోదు చేయడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు అన్నారు. అటు టీడీపీ సీనియర్ నేతలు సైతం సోమిరెడ్డి పై కేసును తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా, సోమిరెడ్డి తమ సంస్థనను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారంటూ శేశ్రిత సంస్థ కూడా సోమిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read also : Hacking : మరింత దగ్గరగా వచ్చేస్తోన్న సైబర్ నేరాలు, ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ చేసి మోసాలు, ఎమ్మెల్యే తల్లి, మహిళానేతకు షాక్.!