పవన్ కళ్యాణ్ పై తలసాని కామెంట్స్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సికింద్రాబాద్ లో ఆయన కుమారుడు సాయి కిరణ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో నాలుగు ఓట్లు కోసం.. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి మధ్య చిచ్చుపెట్టడం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి మధ్య చిచ్చుపెట్టేలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని.. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ […]

పవన్ కళ్యాణ్ పై తలసాని కామెంట్స్..!

Updated on: Mar 27, 2019 | 4:45 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సికింద్రాబాద్ లో ఆయన కుమారుడు సాయి కిరణ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో నాలుగు ఓట్లు కోసం.. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి మధ్య చిచ్చుపెట్టడం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి మధ్య చిచ్చుపెట్టేలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని.. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ ని తెలంగాణ అడ్డుకుంటోందని చంద్రబాబు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారని విమర్శించారు.

ఇక ఇంట్లో దేవుడిని మొక్కని బీజేపీ కార్యకర్తలు.. ఎన్నికలు రాగానే.. హిందుత్వం, దేశభక్తి గుర్తుకొస్తుందని సెటైర్లు వేశారు. సాయి కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరిన ఆయన.. 29న జరిగే సీఎం సభను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఇకపోతే కేసీఆర్ పేరు చెబితే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడతాయని కౌంటర్లు వేశారు తలసాని.