అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి(Pedda Reddy) వర్సెస్ జేసీ ప్రభాకర్‌రెడ్డిగా(JC Prabhakar Reddy) మారుతోంది పరిస్థితి. కొద్దిరోజులుగా వీరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. పెద్దారెడ్డి వచ్చే దారిలో వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఉద్దేశిస్తూ.. ఆయన పోయేదాక నన్ను పోనివ్వరా అంటూ మండిపడ్డారు. ఆలూరులో జరుగుతున్న రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. అదే సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అటుగా వెళ్తున్నారు. ఇది గమనించిన పోలీసులు జేసీని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లేదాకా ఆగాలని జేసీకి సూచించారు. దీంతో ఆగ్రహించిన జేసీ.. పోలీసులను తోసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించాడు.
తనను అడ్డుకోవడంపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వెళ్లేదాకా ఇక్కడే ఉండాలా అంటూ ఫైరయ్యారు. సరే కానివ్వండి.. ఏం చేస్తాం? పోలీసులకు కొన్ని రూల్స్ ఉంటాయి. అట్లనే కానియ్యండి అంటూ వెటకారంగా మాట్లాడారు. పోలీసులకు దమ్ములేదా అని ప్రశ్నించారు.
కొంతకాలంగా ఉప్పునిప్పుగా ఉన్న జేసీ, పెద్దారెడ్డి ఎదురుపడితే ఘర్షణ తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జేసీని బుజ్జగించి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లిపోయాకే.. జేసీని అనుమతించారు. దీంతో అటు ఆలూరు గ్రామస్థులు, ఇటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తుతున్న భక్తులు.. పార్కింగ్ ఫీజుల పేరుతో మొదలైన వసూళ్ల దందా..
Viral Video: ఆక్సిజన్ మాత్రమే కాదు దాహం తీరుస్తోంది.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..