
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ఇవాళ గురుదాస్‌పుర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. సోదరుడు బాబీ డియోల్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ పత్రాల దాఖలుకు ముందు.. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని ఆయన సందర్శించారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ సునిల్ జాకర్.. గురుదాస్‌పుర్ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో సన్నీడియోల్, సునిల్ మధ్య టఫ్ ఫైట్ జరగనుంది.