Dharmapuri Srinivas: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
Dharmapuri Srinivas

Dharmapuri Srinivas: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

Edited By: Ravi Kiran

Updated on: Jun 29, 2024 | 6:57 AM

Dharmapuri Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ మాజీ మెంబర్ ధర్మపురి శ్రీనివాస్‌ నేడు (శనివారం) తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నివసిస్తోన్న ఆయన.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీ శ్రీనివాస్.. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన.. వీల్ చైర్‌కే పరిమితయ్యారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ మాజీ మెంబర్ ధర్మపురి శ్రీనివాస్‌ నేడు (శనివారం) తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నివసిస్తోన్న ఆయన.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీ శ్రీనివాస్.. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన.. వీల్ చైర్‌కే పరిమితయ్యారు. డీఎస్‌గా పేరుగాంచిన ధర్మపురి శ్రీనివాస్.. కాంగ్రెస్‌ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీఎస్‌ మంత్రిగా(2004, 2009లో) సేవలందించారు. ఈ క్రమంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగానూ కొంత కాలం పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరలా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Published on: Jun 29, 2024 06:28 AM