పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి

| Edited By:

May 08, 2019 | 7:10 PM

పశ్చిమబెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తృణమూల్‌ అభ్యర్థి బీర్బహా సోరెన్‌ తరఫున ప్రచారం చేసేందుకు ప్రముఖ బెంగాలి నటి నస్రత్ జహాన్‌ బుధవారం ఝార్‌గ్రామ్‌ వెళ్లారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. నస్రత్ స్టేజ్‌పై ఉండగా కొందరు అభిమానులు సెల్ఫీ కోసం ఒక్కసారిగా స్టేజ్‌పైకి వచ్చారు. దీంతో స్టేజీ కుప్పకూలింది. ఈ ఘటనతో నస్రత్ ఒకింత కంగారుకు గురయ్యారు. అయితే వేదిక ఎత్తు తక్కువగా ఉండటంతో ఈ […]

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి
Follow us on

పశ్చిమబెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తృణమూల్‌ అభ్యర్థి బీర్బహా సోరెన్‌ తరఫున ప్రచారం చేసేందుకు ప్రముఖ బెంగాలి నటి నస్రత్ జహాన్‌ బుధవారం ఝార్‌గ్రామ్‌ వెళ్లారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. నస్రత్ స్టేజ్‌పై ఉండగా కొందరు అభిమానులు సెల్ఫీ కోసం ఒక్కసారిగా స్టేజ్‌పైకి వచ్చారు. దీంతో స్టేజీ కుప్పకూలింది. ఈ ఘటనతో నస్రత్ ఒకింత కంగారుకు గురయ్యారు. అయితే వేదిక ఎత్తు తక్కువగా ఉండటంతో ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. అయితే నస్రత్ జహాన్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బసిరత్‌ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు.