ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌.. చంద్రబాబు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారన్న ప్రభుత్వ సలహాదారు

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. SEC నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ప్రభుత్వ సలహాదారు..

ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌.. చంద్రబాబు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారన్న ప్రభుత్వ సలహాదారు

Updated on: Jan 29, 2021 | 2:59 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. SEC నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌ అయ్యారు. తనను ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌కు లేఖ రాయడంపై సజ్జల మండిపడ్డారు.

ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాజకీయ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్‌ఈసీ స్థానంలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని హితవు పలికారు. నిమ్మగడ్డ వ్యవహార శైలి ఆక్షేపణీయంగా ఉందన్నారు. ఎస్‌ఈసీ వ్యవస్థ సంయమనంతో ఉండాలని సజ్జల చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్‌లా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను నిమ్మగడ్డ నమ్మకపోతే ఎలా అన్నారు. టీడీపీ గూండాలను పెట్టుకుని ఎన్నికలను జరుపుకుంటారా అంటూ సజ్జల ప్రశ్నించారు.

మేం ఎక్కడా గీత దాటలేదు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అన్ని హద్దులు దాటేశారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ నియంత్రణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎన్నికలను సజావుగా జరపడం ఎస్‌ఈసీ బాధ్యత అని గుర్తుంచుకోవాలని చెప్పారు.

 

డబ్బులు మారినట్టు తెలిస్తే కఠిన చర్యలు.. ఏకగ్రీవాలు ఫ్రీ అండ్‌ ఫేర్‌గా జరగాలన్న కలెక్టర్‌

డబ్బులు మారినట్టు తెలిస్తే కఠిన చర్యలు.. ఏకగ్రీవాలు ఫ్రీ అండ్‌ ఫేర్‌గా జరగాలన్న కలెక్టర్‌