బీజేపీలో చేరినా నష్టమేమి లేదు.. ఆయనేం పెద్ద లీడర్ కాదు

న్యూఢిల్లీ: సోనియా గాంధీ కార్యదర్శిగా పనిచేసిన టామ్ వడక్కన్.. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు సేవలందించిన నేత. ఆయన ఇప్పటికీ ఆమెకు చాలా సన్నిహితంగా ఉండే నేత. అలాంటి వ్యక్తి హఠాత్తుగా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి గురువారం బీజేపీ గూటికి చేరారు. అయితే ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. వడక్కనా..? లేదు, లేదు.. వడక్కన్ పెద్ద లీడరేమీ కాదు అని రాహుల్ అన్నారు. ఆయన పార్టీ మారడాన్ని చాలా తేలిగ్గా తీసుకున్న రాహుల్.. […]

బీజేపీలో చేరినా నష్టమేమి లేదు.. ఆయనేం పెద్ద లీడర్ కాదు

Edited By:

Updated on: Mar 15, 2019 | 4:06 PM

న్యూఢిల్లీ: సోనియా గాంధీ కార్యదర్శిగా పనిచేసిన టామ్ వడక్కన్.. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు సేవలందించిన నేత. ఆయన ఇప్పటికీ ఆమెకు చాలా సన్నిహితంగా ఉండే నేత. అలాంటి వ్యక్తి హఠాత్తుగా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి గురువారం బీజేపీ గూటికి చేరారు. అయితే ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. వడక్కనా..? లేదు, లేదు.. వడక్కన్ పెద్ద లీడరేమీ కాదు అని రాహుల్ అన్నారు. ఆయన పార్టీ మారడాన్ని చాలా తేలిగ్గా తీసుకున్న రాహుల్.. తాను ప్రధానంగా మూడు అంశాలపై బీజేపీని టార్గెట్ చేస్తున్నట్లు చెప్పారు. అన్నింటికన్నా పెద్ద సమస్య నిరుద్యోగం. ఇందులో మోదీ విఫలమయ్యారు. ఇక రెండోది అవినీతి. మీకు రాఫెల్ గురించి తెలిసే ఉంటుంది. మూడోది రైతుల సమస్య అని రాహుల్ గాంధీ అన్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడైన టామ్ వడక్కన్.. తాను బరువైన హృదయంతో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ సమగ్రతను అనుమానించేలా కాంగ్రెస్ మాట్లాడటం తనను తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్లు వడక్కన్ చెప్పారు. అయితే రాహుల్ మాత్రం వడక్కన్ పెద్ద లీడరేమీ కాదు అని చాలా తేలికగా తీసిపారేశారు.