వైసీపీకి కేఏ పాల్ ఝలక్!

| Edited By:

Mar 26, 2019 | 3:07 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేర్లతో సరి పోలిన పేర్లు ఉన్న‌ వారితోనే నామినేషన్లు వేయించిన పాల్, వైసీపీని మరింత కలవరానికి గురిచేస్తున్నారు. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే కేఏ పాల్ నడుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను గందరగోళానికి గురిచేసి తమ అభ్యర్థుల విజయవకాశాలను దెబ్బకొట్టడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పర్చూరులో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేయగా, అక్కడ […]

వైసీపీకి కేఏ పాల్ ఝలక్!
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేర్లతో సరి పోలిన పేర్లు ఉన్న‌ వారితోనే నామినేషన్లు వేయించిన పాల్, వైసీపీని మరింత కలవరానికి గురిచేస్తున్నారు. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే కేఏ పాల్ నడుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను గందరగోళానికి గురిచేసి తమ అభ్యర్థుల విజయవకాశాలను దెబ్బకొట్టడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

పర్చూరులో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేయగా, అక్కడ అదే పేరు గల వ్యక్తి ప్రజా శాంతి పార్టీ తరఫున నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లాలోని ఎనిమిది చోట్ల వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన వారితోనే పాల్ నామినేషన్ వేయించారు. రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి పార్టీ తరపున ఉండాల రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు.

పెనుగొండలో ఎం శంకర్ నారాయణ వైసీపీ, ఎస్ శంకర్ నారాయణ ప్రజా శాంతి పార్టీ, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి తరఫున పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డిని బరిలో నిలబెట్టారు. ఉరవకొండలో వైసీపీ తరపున విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తుంటే, విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి పాల్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కల్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉషా శ్రీచరణ్, ప్రజా శాంతి నుంచి ఉషారాణి నామినేషన్ వేశారు. రాప్తాడు నుంచి వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ప్రజాశాంతి నుంచి డీ ప్రతాప్ బరిలో ఉన్నారు. అనంతపురం అర్బన్‌లో వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి పోటీ చేస్తుండగా, ప్రజా శాంతి పార్టీ నుంచి పగిడి వెంకరామిరెడ్డి నామినేషన్ వేశారు.