సవాల్ మీద సవాల్.. అనంత పాలిటిక్సే వేరులే..!

|

Nov 26, 2019 | 5:27 PM

రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు చేయడం సహజం. కాని ఆ నియోజకవర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే తన రూటే సెపరేటు అంటున్నారు. తనపై ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే… తాను చేసిన పనులపై సీఐడీ, ఏసీబీ విచారణ జరిపించాలని తానే డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే విచారణకు సహకరించడమే కాదు.. నిరూపిస్తే సన్మానం కూడా చేస్తానని ఛాలెంజ్ విసురుతున్నారు. ఇటు అధికార పార్టీ కూడా సై అనడంతో…ఆ నియోజకవర్గంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ క్రియేట్ అయింది. […]

సవాల్ మీద సవాల్.. అనంత పాలిటిక్సే వేరులే..!
Follow us on

రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు చేయడం సహజం. కాని ఆ నియోజకవర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే తన రూటే సెపరేటు అంటున్నారు. తనపై ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే… తాను చేసిన పనులపై సీఐడీ, ఏసీబీ విచారణ జరిపించాలని తానే డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే విచారణకు సహకరించడమే కాదు.. నిరూపిస్తే సన్మానం కూడా చేస్తానని ఛాలెంజ్ విసురుతున్నారు. ఇటు అధికార పార్టీ కూడా సై అనడంతో…ఆ నియోజకవర్గంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ క్రియేట్ అయింది. ఇంతకీ ఎక్కడనేగా మీ సందేహం? రీడ్ దిస్ స్టోరీ..

అనంతపురం అర్బన్ నియోజకవర్గం. పొలిటికల్‌గా చాలా యాక్టివ్‌గా ఉన్న ప్రాంతం. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ ఉండే వారంతా చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేసే ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. అందుకే ఇక్కడ మెచ్యూర్డ్ రాజకీయాలు ఉంటాయి. ఎన్నికల సమయంలో తప్ప పాలిటిక్స్ పెద్దగా కనిపించవు. కాని ఎన్నికలు ముగిసిన ఆరు నెలలకు పొలిటికల్ వాతావరణం వేడెక్కుతోందిప్పుడు.

2014ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019ఎన్నికల్లో వైసీపీ నుంచి అనంత వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వీరు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నా.. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండేవారు. చాలా మంచి సంబంధాలు కూడా ఉండేవి. అందుకే ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నా ఎప్పుడూ హద్దులు దాటి విమర్శలు చేసుకోలేదు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అనంత వర్సెస్‌ ప్రభాకర్‌ ఫైట్ ఒక్కసారిగా ముదిరిపోయింది. గత ఐదేళ్లలో అనంతపురం నగరాన్ని సర్వం నాశనం చేశారని అధికార పార్టీ విమర్శిస్తే….మాజీ ఎమ్మెల్యే కూడా గట్టిగానే రియాక్ట్‌ అయ్యారు. తాను అవినీతి చేసి ఉంటే… సిఐడీతో కాని, ఏసీబీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇందుకు తాను సహకరించడమే కాకుండా.. నిరూపించిన వారికి సన్మానం చేస్తానంటూ సవాల్ విసిరారు. అంతే కాకుండా తాము నగరాన్ని నాశనం చేస్తే.. మేము పూర్తి చేసిన వాటిని ఇప్పుడెలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఇలా ఎమ్మెల్యేకు ప్రశ్నల వర్షం కురిపిస్తూ తనపై విచారణ చేయించుకోవాలని నాలుగు పేజీల లేఖ విడుదల చేశారు.

మాజీ ఎమ్మెల్యే చౌదరి వ్యాఖ్యలతో పొలిటికల్ వాతావరణం మారిపోయింది. మిత భాషిగా ఉండే ప్రస్తుత ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి దీనిపై స్పందించకపోయినా.. వైసీపీ నేతలతో స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇప్పించారు. ఐదేళ్ల పాటు నగరాన్ని నాశనం చేసిన మీరా.. మాకు సుద్దులు చెప్పేందంటూ వైసీపీ నేతలు చౌదరిపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేను విమర్శించే కనీస అర్హత లేదన్నారు. దీనికి చౌదరి రియాక్ట్ కాకుండా టీడీపీకి చెందిన మాజీ కార్పొరేటర్లతో ప్రెస్ మీట్ పెట్టించారు. వారు కూడా స్వామి భక్తి చాటుకుంటూ చౌదరిని వెనుకేసుకొస్తూ.. వైసీపీపై విమర్శలు గుప్పించారు. ధైర్యముంటే చౌదరి రాసిన లేఖపై స్పందించాలని సవాల్ విసిరారు. ఇలా లీడర్లు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు నగరంలో పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తున్నాయి.