పవన్ కళ్యాణ్ అఫిడవిట్‌లో సంచలన విషయాలు?

| Edited By: Anil kumar poka

Mar 22, 2019 | 7:08 PM

విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హాల్‌చల్ చేసింది. నామినేషన్ సందర్భంగా పవన్ సమర్పించిన అప్పుల వివరాలు ఇవేనంటూ పలు వివరాలు వైరల్‌గా మారాయి. వాటి ప్రకారం పవన్‌కు రూ. 33 కోట్ల అప్పు ఉందట. తన వదిన సురేఖకు, స్నేహితుడు త్రివిక్రమ్‌కు, సెలబ్రిటీ మేనేజర్ ప్రవీణ్ కుమార్‌కు అప్పు ఉన్నారు. వీరితోపాటు […]

పవన్ కళ్యాణ్ అఫిడవిట్‌లో సంచలన విషయాలు?
Follow us on

విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హాల్‌చల్ చేసింది. నామినేషన్ సందర్భంగా పవన్ సమర్పించిన అప్పుల వివరాలు ఇవేనంటూ పలు వివరాలు వైరల్‌గా మారాయి. వాటి ప్రకారం పవన్‌కు రూ. 33 కోట్ల అప్పు ఉందట. తన వదిన సురేఖకు, స్నేహితుడు త్రివిక్రమ్‌కు, సెలబ్రిటీ మేనేజర్ ప్రవీణ్ కుమార్‌కు అప్పు ఉన్నారు. వీరితోపాటు మరికొందరు నిర్మాతలకు కూడా పవన్ అప్పు ఉన్నారు.

సోషల్ మీడియా ప్రకారం పవన్ అప్పుల వివరాలు..
త్రివిక్రమ్ శ్రీనివాస్ – రూ. 2.40 కోట్లు
హారిక హాసిని – రూ. 1.25 కోట్లు
సురేఖ – 1.07 కోట్లు
ప్రవీణ్ కుమార్ – రూ. 3 కోట్లు
ఎంవీఆర్ఎస్ ప్రసాద్ – రూ. 2 కోట్లు
శ్రీ బాలాజీ సైన్ చిత్ర మీడియా – రూ. 2 కోట్లు
నవీన్ కుమార్ – రూ. 5.50 కోట్లు
వీటితో పాటు మరో రూ. 33 కోట్ల అప్పులు ఉన్నట్టు వినిపిస్తోంది.