విజయసాయిరెడ్డికి పవన్ కౌంటర్

విజయవాడ: విజయసాయిరెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితమే జనసేనలో చేరిన మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీ నారాయణపై విజయసాయిరెడ్డి ట్వీట్టర్‌లో చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. నేరస్తులు, తప్పుడు పనులు చేసే వ్యాపారులు చట్టసభలకు వెళ్తే ప్రజలకు న్యాయం జరగదని మండిపడ్డారు. విశాఖ లోక్‌సభ అభ్యర్ధిగా మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణను ప్రకటిస్తే ప్రతిపక్ష నేత జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఎందుకంత […]

విజయసాయిరెడ్డికి పవన్ కౌంటర్

Updated on: Mar 22, 2019 | 9:57 AM

విజయవాడ: విజయసాయిరెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితమే జనసేనలో చేరిన మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీ నారాయణపై విజయసాయిరెడ్డి ట్వీట్టర్‌లో చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. నేరస్తులు, తప్పుడు పనులు చేసే వ్యాపారులు చట్టసభలకు వెళ్తే ప్రజలకు న్యాయం జరగదని మండిపడ్డారు. విశాఖ లోక్‌సభ అభ్యర్ధిగా మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణను ప్రకటిస్తే ప్రతిపక్ష నేత జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఎందుకంత భయం అని పవన్ ప్రశ్నించారు.