సత్తెనపల్లి టీడీపీలో తారా స్థాయికి వర్గ విభేదాలు

అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల్లో ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. టిక్కెట్ ఆశించేవాళ్లు, నిరాశకు గురైన వాళ్లు నిరసనలు తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. స్పీకర్ కోడెల నియోజకవర్గం కావడంతో సహజంగానే దీనిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంంది. కోడెల వ్యతిరేకంగా అసమ్మతి వర్గం నల్ల బ్యాడ్జీలను ధరించి ఆందోళనలు తెలుపుతోంది. కోడెల హఠావో, సత్తెనపల్లి బచావో అంటూ నినాదులు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే మరో పక్క కోడెల […]

సత్తెనపల్లి టీడీపీలో తారా స్థాయికి వర్గ విభేదాలు

Updated on: Mar 14, 2019 | 2:46 PM

అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల్లో ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. టిక్కెట్ ఆశించేవాళ్లు, నిరాశకు గురైన వాళ్లు నిరసనలు తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. స్పీకర్ కోడెల నియోజకవర్గం కావడంతో సహజంగానే దీనిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంంది.

కోడెల వ్యతిరేకంగా అసమ్మతి వర్గం నల్ల బ్యాడ్జీలను ధరించి ఆందోళనలు తెలుపుతోంది. కోడెల హఠావో, సత్తెనపల్లి బచావో అంటూ నినాదులు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే మరో పక్క కోడెల మాత్రం సత్తెనపల్లి నుంచి తానే పోటీ చేస్తున్నానని, పార్టీ తనకు రెండోసారి అవకాశం ఇచ్చిందని వెల్లడించారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు సర్దుకుపోతాయి, ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నా అని కోడెల చెప్పారు.