ఎమ్మెల్యే కాదు కదా… కౌన్సిలర్ కూడా సిద్ధంగా లేడు… మోదీకి టీఎంసీ కౌంటర్

| Edited By:

Apr 29, 2019 | 8:38 PM

టీఎంసీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.ఎమ్మెల్యేలు కాదు.. కనీసం ఒక్క మున్సిపల్ కౌన్సిలర్ సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధంగా లేరని టీఎంసీ నేత డెరిక్ ఓ బెరీన్ విమర్శించారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో స్పందించిన డెరిక్.. మోదీ చేసేది ఎన్నికల ప్రచారమా లేక, హార్స్ ట్రేడింగా అని విమర్శించారు. మోదీ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు డెరిక్ తెలిపారు. […]

ఎమ్మెల్యే కాదు కదా... కౌన్సిలర్ కూడా సిద్ధంగా లేడు... మోదీకి టీఎంసీ కౌంటర్
Follow us on

టీఎంసీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.ఎమ్మెల్యేలు కాదు.. కనీసం ఒక్క మున్సిపల్ కౌన్సిలర్ సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధంగా లేరని టీఎంసీ నేత డెరిక్ ఓ బెరీన్ విమర్శించారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో స్పందించిన డెరిక్.. మోదీ చేసేది ఎన్నికల ప్రచారమా లేక, హార్స్ ట్రేడింగా అని విమర్శించారు. మోదీ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు డెరిక్ తెలిపారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని టార్గెట్ చేసుకొని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలుచేశారు. ఒక్కసారి సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యాక బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయని మోదీ అన్నారు.