నటులతో కాదు..రైతులతో మాట్లాడండి మోదీ గారు- ప్రియాంక గాంధీ

|

Apr 24, 2019 | 7:34 PM

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని  పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. తనకు ప్రముఖుల జీవిత చరిత్రలు చదవడం అంటే ఇష్టమని, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనకు ప్రతి ఏటా బట్టలు, మిఠాయిలు పంపిస్తారని, అసలు ఆర్మీలోకి వెళ్లాలనుకున్న తాను ప్రధాని  అవుతానని అనుకోలేదని చెప్పారు. అయితే, అక్షయ్ కుమార్‌తో ఇంటర్వ్యూపై మోదీకి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా చురకలు […]

నటులతో కాదు..రైతులతో మాట్లాడండి మోదీ గారు- ప్రియాంక గాంధీ
Follow us on

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని  పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. తనకు ప్రముఖుల జీవిత చరిత్రలు చదవడం అంటే ఇష్టమని, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనకు ప్రతి ఏటా బట్టలు, మిఠాయిలు పంపిస్తారని, అసలు ఆర్మీలోకి వెళ్లాలనుకున్న తాను ప్రధాని  అవుతానని అనుకోలేదని చెప్పారు. అయితే, అక్షయ్ కుమార్‌తో ఇంటర్వ్యూపై మోదీకి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా చురకలు అంటించారు. ‘నటులతో మాట్లాడితే మీకు ఆనందం కలిగించే ప్రశ్నలు వేస్తారు. అదే.. రైతులతో మాట్లాడితే ఘాటు తగిలే ప్రశ్నలు ఎదురవుతాయి’ అని విమర్శించారు. అన్నదాతలతో మాట్లాడితే వారి కష్టాలు తెలుస్తాయని చెప్పారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గానికి వెళ్లి అక్కడి ప్రజల్ని అడగ్గా.. మోదీ ఒక్కసారి కూడా తమ పల్లెల్లో పర్యటించలేదని తనకు చెప్పారని అన్నారు. కాగా, మోదీకి స్వాగతం పలికేందుకు తాగునీటిని రోడ్ల పాలు చేయడంపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దేశానికి చౌకీదారా లేక చక్రవర్తా అంటూ మండిపడ్డారు. బుందేల్‌ఖండ్‌లో ప్రజలు తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతుంటే ప్రధాని రాక కోసం బందాలో తాగునీటిని పారబోయడమేంటని నిలదీశారు. ఈ వారం చివర్లో ప్రధాని బందా రానున్న నేపథ్యంలో ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి రోడ్లు కడుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు.