జగన్‌పై నారా రోహిత్ ఫైర్

తమ కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయంటూ వస్తున్న వార్తలపై టాలీవుడ్ హీరో నారా రోహిత్ స్పందించాడు. అలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. హీరో రోహిత్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెదనాన్న అనే విషయం తెలిసిందే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో తమ కుటుంబంపై వస్తున్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. సొంత బాబుయి మీదే చేయి చేసుకున్న చరిత్ర మీది.  కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగే మీకు  […]

జగన్‌పై నారా రోహిత్ ఫైర్

Updated on: Mar 25, 2019 | 4:04 PM

తమ కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయంటూ వస్తున్న వార్తలపై టాలీవుడ్ హీరో నారా రోహిత్ స్పందించాడు. అలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. హీరో రోహిత్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెదనాన్న అనే విషయం తెలిసిందే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో తమ కుటుంబంపై వస్తున్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. సొంత బాబుయి మీదే చేయి చేసుకున్న చరిత్ర మీది.  కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగే మీకు  కుటుంబ బాంధవ్యాల గురించి ఏం తెలుసు.  మా పెదనాన్న మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే వార్తలు అవాస్తవం.  అయన మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.  అనారోగ్య కారణాల వల్లే తన తండ్రి ఇంటికే పరిమితమయ్యారని చెప్పుకొచ్చారు. ఇవే విషయాలను ఉటంకిస్తూ  నారా రోహిత్ ఓ ప్రకటనను విడుదల చేశారు.