మరీ ఇంతా పిచ్చా..? ఏపీ సీఎంపై లోకేష్ ట్వీట్‌

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. జగన్‌కు పిచ్చి పీక్‌ స్టేజ్‌కు చేరిందని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలోని నాగార్జునా యూనివర్సిటీ ప్రాంగణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహన్ని ఏర్పాటు చేస్తుండటాన్ని లోకేష్‌ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా కామెంట్‌ చేశారు. “ప్రతి పిచ్చికీ ఓ లెక్కుంటుందని..కానీ, జగన్‌ పిచ్చికి మాత్రం అది ఉన్నట్టు […]

మరీ ఇంతా పిచ్చా..? ఏపీ సీఎంపై లోకేష్ ట్వీట్‌

Edited By:

Updated on: Nov 27, 2019 | 9:10 PM

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. జగన్‌కు పిచ్చి పీక్‌ స్టేజ్‌కు చేరిందని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలోని నాగార్జునా యూనివర్సిటీ ప్రాంగణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహన్ని ఏర్పాటు చేస్తుండటాన్ని లోకేష్‌ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా కామెంట్‌ చేశారు. “ప్రతి పిచ్చికీ ఓ లెక్కుంటుందని..కానీ, జగన్‌ పిచ్చికి మాత్రం అది ఉన్నట్టు కనిపించడం లేదన్నారు’. నాగార్జునా విశ్వవిద్యాలయంలో వైఎస్‌ఆర్‌ విగ్రహన్ని ఏర్పాటు చేయాలని అనుకోవడం అధికార దుర్వినియోగమేనని ఆరోపించారు. అటు టీడీపీ శ్రేణులు సైతం విగ్రహ ఏర్పాటుపై పలు విమర్శలు చేశారు. విద్యార్థులకు స్పూర్తినిచ్చేందుకు విద్యాలయాల్లో మహనీయులు, మేధావులు, శాస్త్రవేత్తల విగ్రహలు పెడతారు కానీ, రాజకీయ నేతల విగ్రహలు పెట్టడం ఏంటని మండిపడ్డారు.