ఇలా చేరారు.. అలా మార్చేశారు

| Edited By:

Jun 21, 2019 | 1:47 PM

రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్‌లు గురువారం టీడీపీని వీడి కాషాయా కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే వీరు పార్టీ మారిన కాసేపటికే రాజ్యసభ వెబ్‌సైట్‌లో ఈ నలుగురిని బీజేపీ ఎంపీలుగా మార్చేశారు అధికారులు. దీనికి సంబంధించిన ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. […]

ఇలా చేరారు.. అలా మార్చేశారు
Follow us on

రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్‌లు గురువారం టీడీపీని వీడి కాషాయా కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే వీరు పార్టీ మారిన కాసేపటికే రాజ్యసభ వెబ్‌సైట్‌లో ఈ నలుగురిని బీజేపీ ఎంపీలుగా మార్చేశారు అధికారులు. దీనికి సంబంధించిన ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి మోదీ నివాసానికి వెళ్లిన నేతలు, ప్రధానితో భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ నలుగురు నేతలకు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.