Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు.
రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేశారు.
జిల్లాల వారీగా ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు:
శ్రీకాకుళం జిల్లా:
ఇచ్చాపురం-7.59 శాతం
పలాస – కాశీబుగ్గ- 10.81 శాతం
పాలకొండ- 6.74 శాతం
పశ్చిమగోదావరి:
జంగారెడ్డిగూడెం- 15.51 శాతం
కొవ్వూరు-17.48 శాతం
నరసాపురం- 5.51 శాతం
నిడదవోలు-13.52 శాతం
కృష్ణా జిల్లా:
విజయవాడ :9.10 శాతం
మచిలీపట్నం :12.33
నూజివీడు : 10.30
పెడన : 15.80
తిరువూరు : 16.82
నందిగామ: 16.59
ఉయ్యురు : 15.10
ప్రకాశం జిల్లా:
ఒంగోలు- 14 శాతం
కనిగిరి- 16 శాతం
గిద్దలూరు-14 శాతం
చీరాల- 11 శాతం
అద్దంకి- 20.26 శాతం
కడప జిల్లా:
కడప-4 శాతం,
రాయచోటి-14 శాతం
మైదుకూరు- 15 శాతం
బద్వేల్ 12 శాతం
ప్రొద్దుటూరు- 9 శాతం
కర్నూలు జిల్లా:
నంద్యాల 9.8 శాతం
ఆదోని- 8.86 శాతం
ఎమ్మిగనూరు- 16.45 శాతం
డోన్-11.96 శాతం
ఆత్మకూరులో 17.51 శాతం
ఆళ్లగడ్డ- 21.28 శాతం
నందికొట్కూరు 13.39 శాతం
విజయనగరం జిల్లా:
విజయనగరం -10.24%
పార్వతీపురం- 13.52%
బొబ్బిలి-14.64%
సాలూరు-14.93%
నెల్లిమర్ల-15.04
Read More:
Municipal Elections 2021: మచిలీపట్నంలో కొనసాగుతున్న పోలింగ్.. వృద్ద ఓటర్లకు పోలీసుల సహాయం