కేశినేని నాని ఎపిసోడ్: బాబుతో గల్లా భేటీ

|

Jun 06, 2019 | 4:40 PM

టీడీపీ నుంచి మరో ఎంపీ రేపో మాపో పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విప్ పదవిని నానికి చంద్రబాబు కేటాయించడం, ఆ పదవిని నాని తిరస్కరించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. కేశినేని నాని, గల్లా జయదేవ్‌లతో భేటీ అయ్యారు. అయినప్పటికీ కేశినేని నాని అలకపాన్పు వీడలేదని తెలిసింది. దీంతో పార్లమెంటరీ పార్టీ పదవి […]

కేశినేని నాని ఎపిసోడ్: బాబుతో గల్లా భేటీ
Follow us on

టీడీపీ నుంచి మరో ఎంపీ రేపో మాపో పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విప్ పదవిని నానికి చంద్రబాబు కేటాయించడం, ఆ పదవిని నాని తిరస్కరించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. కేశినేని నాని, గల్లా జయదేవ్‌లతో భేటీ అయ్యారు. అయినప్పటికీ కేశినేని నాని అలకపాన్పు వీడలేదని తెలిసింది. దీంతో పార్లమెంటరీ పార్టీ పదవి ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని జయదేవ్ చంద్రబాబుకు స్పష్టం చేశారు. ఇక దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది చర్చించదగ్గ అంశంగా మారింది.