జేసీ తీరుతో ఏడ్చేసిన ఎమ్మెల్సీ శమంతకమణి

అమరావతి: రాజధాని అమరావతిలో బుధవారం నిర్వహించిన ప్రజావేదిక వద్ద అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరుతో ఎమ్మెల్సీ శమంతకమణి కంటతడి పెట్టారు. శమంతకమణితో పాటు, ఎమ్మెల్యే యామినీబాలపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శమంతకమణి, యామినీబాల ప్రజావేదిక వద్ద ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో మాట్లాడేందుకు రాగా, జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ దశలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. సింగనమల టికెట్ ను బండారు శ్రావణికి ఇవ్వాలంటూ […]

జేసీ తీరుతో ఏడ్చేసిన ఎమ్మెల్సీ శమంతకమణి

Edited By:

Updated on: Mar 13, 2019 | 9:18 PM

అమరావతి: రాజధాని అమరావతిలో బుధవారం నిర్వహించిన ప్రజావేదిక వద్ద అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరుతో ఎమ్మెల్సీ శమంతకమణి కంటతడి పెట్టారు. శమంతకమణితో పాటు, ఎమ్మెల్యే యామినీబాలపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శమంతకమణి, యామినీబాల ప్రజావేదిక వద్ద ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో మాట్లాడేందుకు రాగా, జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ఈ దశలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. సింగనమల టికెట్ ను బండారు శ్రావణికి ఇవ్వాలంటూ గత కొంతకాలంగా జేసీ టీడీపీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే సింగనమల టికెట్ తనకే ఇవ్వాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీబాల పట్టుబడుతున్నారు. ఈ కారణంగానే జేసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Follow Us