‘మిథున్ చక్రవర్తి ఒకప్పుడు నక్సలైట్’, తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగత రాయ్ ఎద్దేవా

| Edited By: Anil kumar poka

Mar 07, 2021 | 8:13 PM

బీజేపీలో నేడు చేరిన నటుడు మిథున్ చక్రవర్తి ఒకప్పుడు నక్సలైట్ అని, అతనికి ప్రజల్లో విశ్వసనీయత గానీ, ఆదరణ గానీ లేదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ అన్నారు. నాడు మిథున్ తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ స్వతహాగా నక్సలైట్ అని, నాలుగుసార్లు పార్టీ మారాడని ఆయన అన్నారు.

మిథున్ చక్రవర్తి ఒకప్పుడు నక్సలైట్, తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగత రాయ్ ఎద్దేవా
Follow us on

బీజేపీలో నేడు చేరిన నటుడు మిథున్ చక్రవర్తి ఒకప్పుడు నక్సలైట్ అని, అతనికి ప్రజల్లో విశ్వసనీయత గానీ, ఆదరణ గానీ లేదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ అన్నారు. నాడు మిథున్ తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ స్వతహాగా నక్సలైట్ అని, నాలుగుసార్లు పార్టీ మారాడని ఆయన అన్నారు. మిథున్ ఇప్పుడు స్టార్ కాదు.. లోగడకొన్ని మూవీల్లో నటించాడు.. అంతే ! మొదట సీపీఎం లో ఉన్నాడని, ఆతరువాత టీఎంసీలో చేరాడని ఆయన అన్నారు.  పార్టీ అతడిని రాజ్యసభకు పంపిందని, అయితే ఈడీ ద్వారా కేసులు పెడతామని బీజేపీ బెదిరించడంతో రాజ్యసభను వదిలి ఇప్పుడు బీజేపీలో చేరాడని సౌగత రాయ్ పేర్కొన్నారు. ప్రజలలో అతడంటే ఎవరికీ గౌరవం లేదని, అతడు బీజేపీలో చేరినా ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆయన పేర్కొన్నారు.

ఇలా ఉండగా బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన మిథున్ చక్రవర్తి..తనను స్వార్థపరుడని విమర్శించినా తాను బాధ పడనని, తన స్వార్థమల్లా పేదల పక్షాన ఉండడమేననిఅన్నారు. వారి సంక్షేమం కోసం పోరాడాలని అనుకుంటున్నానని, అది ఇప్పుడు బీజేపీ ద్వారా తీరనున్నదని అన్నారు. తన 18 ఏళ్ళ వయస్సు నుంచే ఈ కోర్కె ఉందని, తన మూవీల్లో చాలావరకు ఇలాగే ఉంటాయని మిథున్ పేర్కొన్నారు. ప్రధాని మోదీని ఈ దేశ గొప్ప నేతగా ఆయన పేర్కొన్నారు. అయన నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధిని సాధించిందని, గత,లో కనిపించని పురోగతిని తానిప్పుడు చూస్తున్నానని మిథున్ వ్యాఖ్యానించాడు.అటు-ఒకప్పుడు శారదా చిట్ ఫండ్ స్కామ్ లో తాను చిక్కుకున్నప్పటికీ తనకు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించిన తృణమూల్ కాంగ్రెస్ పట్ల మాత్రం మిథున్ ప్రస్తుతం ఒక్క మాట కూడా మాట్లాడలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. బీజేపీలో చేరినంత  మాత్రాన తనను ఒకప్పుడు అక్కున జేర్చుకున్న పార్టీ అది అన్న విషయాన్ని ఆయన విస్మరించారని విమర్శిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

రంగారెడ్డి జిల్లాలో భయానక ఘటన.. మిట్ట మధ్యాహ్నం రోడ్డు పక్కన వేపచెట్టుకు వేలాడుతూ మనిషి.. తీరా చూస్తే..

Farmer Suicide: టిక్రీ బోర్డర్‌లో మరో రైతు ఆత్మహత్య.. ఘటనా స్థలంలో లేఖ లభ్యం..