YS Sharmila: ప్రజలు అన్ని రాజ్యాలు చూసిన తర్వాతే కేసీఆర్ వైపు మళ్లారు… తెలంగాణలో రాజన్న రాజ్యంపై మంత్రి అజయ్‌

|

Mar 19, 2021 | 2:15 PM

YS Sharmila: మీడియా చిట్ చాట్ లో షర్మిల పార్టీపై మంత్రి అజయ్ కామెంట్స్ చేశారు. ఖమ్మం ప్రజలు అన్ని రాజ్యాలు చూసిన తర్వాతే కేసీఆర్ వైపు

YS Sharmila: ప్రజలు అన్ని రాజ్యాలు చూసిన తర్వాతే కేసీఆర్ వైపు మళ్లారు... తెలంగాణలో రాజన్న రాజ్యంపై మంత్రి అజయ్‌
Follow us on

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై వైయస్‌ షర్మిల స్పీడ్‌ పెంచిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలిన వైయస్‌ షర్మిల నిర్వణయించారు. ఈ మేరకు సభ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. బహిరంగ సభ నిర్వహణపై వైయస్‌ షర్మిల కోర్దినేషన్ కమిటీ వేశారు.

అయితే మీడియా చిట్ చాట్ లో షర్మిల పార్టీపై మంత్రి అజయ్ కామెంట్స్ చేశారు. ఖమ్మం ప్రజలు అన్ని రాజ్యాలు చూసిన తర్వాతే కేసీఆర్ వైపు మళ్లారు. ఇక్కడి ప్రజలు ఎవరి ఉచ్చులో పడరు. ఒకవేళ చిన్న చితక నాయకులు పడితే వాళ్ళ ఇష్టం. ప్రజలు తెరాస ప్రభుత్వం,కెసిఆర్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజా రంజకంగ పాలన సాగుతుందని మంత్రి అజయ్‌ తెలిపారు.

మరో వైపు ఖమ్మం సభ కి రాష్ట్ర వ్యాప్తంగా భారీ జన సమీకరణ చేయలని లోటస్‌పాండ్‌ వర్గాలు ప్లాన్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 100మంది ఖమ్మం జిల్లా నేతలు కార్యకర్తలతో వైయస్‌ షర్మిల లోటస్‌పాండ్‌ కార్యాలయంలో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖమ్మం సభ నుండి తన పార్టీ పై పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు వైయస్‌ షర్మిల. తన పార్టీ పై విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చేలా ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణలో నెలొకొన్న ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజల్లోకి వెళతామంటూ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచుతున్నారు. గతంలో తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా అంటూ ప్రశ్నించిన షర్మిల.. భైంసా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించారు.

నిర్మల్‌ జిల్లా భైంసాలో నాలుగేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి అమానుషమని షర్మిల పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగి రోజులు గడుస్తున్నా నిందితులకు శిక్ష ఎందుకు పడడంలేదని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో చిన్నారులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.. కరీంనగర్ కామన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తుంది’ అని వైఎస్‌ షర్మిల అన్నారు. యావత్ తెలంగాణకు కరీంనగర్ అద్దం పడుతుందని ఆమె వెల్లడించారు. ‘సిటీ ఆఫ్ ఎనర్జీ’ మన రామగుండం అని ఆమె చెప్పుకొచ్చారు. ‘సింగరేణి మనకు తలమానికం.. అగ్గిపెట్టెలో పట్టే చీర నేచిన నేతన్నలు కనిపిస్తారు. నారాయణ రెడ్డి, గిద్దే రాములు ఇక్కడి రాములు. అని షర్మిల అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయి, తెలంగాణలో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియలో చురుగ్గా అడుగులు వేస్తున్న షర్మిల ఇవాళ కరీంనగర్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో హైదరాబాద్‌ లోటస్ పాండ్ ఆఫీస్‌లో ఆత్మీయ సమ్మేళనం జరిపారు.

దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి – కరీంనగర్ జిల్లాకు విడదీయరాని బంధం ఉందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్.. ఉచిత విద్యుత్ పథకం ఇచ్చింది కూడా కరీంనగర్ జిల్లా రైతుల కష్టాలు చూసేనని ఆమె చెప్పుకొచ్చారు. ‘సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. లక్షన్నర చొప్పున కుటుంబానికి పరిహారం ఇప్పించారు. బ్యాంకుల ద్వారా నేతన్నలకు రుణాలు ఇప్పించారు. కరీంనగర్ జిల్లా ‘రైస్ బౌల్’ అని అనడానికి రాజశేఖర్ రెడ్డే కారణం అని షర్మిల వెల్లడించారు.

Read More:

లోటస్‌పాండ్‌లో కొత్తపార్టీ ఏర్పాట్లు ముమ్మరం.. ఖమ్మం సభపై కోఆర్డినేషన్‌ కమిటీ వేసిన షర్మిల