
ఎస్‌ఈసీ షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ఎన్నికల కమిషన్‌పై తాను ఎలాంటి దురుద్దేశ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. రాజ్యంగ సంస్థలంటే గౌరవం ఉందని.. తొలిదశ ఎన్నికల ఫలితాలపై మాత్రమే మాట్లాడానని చెప్పారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వారు వ్యాఖ్యలకు సమాధానం చెప్పనన్నారు. తన వివరణను పరిగణలోకి తీసుకుని.. షోకాజ్ నోటీసు వెనక్కి తీసుకోవాలని మంత్రి ఎస్‌ఈసీని కోరారు. కేవలం ఎస్ఈసీకి సలహా మాత్రమే ఇచ్చామని, దూషణలు చేయలేదని చెప్పారు.