మోదీ ప్ర‌క‌ట‌న‌ల ఖర్చు రూ. 3044 కోట్లు : మాయావతి

| Edited By:

Mar 16, 2019 | 4:40 PM

లక్నో :  బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ట్విట్టర్ వేధికగా ప్రధాని మోదీ, బీజేపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రధాని మోదీకి ప్రచారమే ముఖ్యమనీ, ప్రజా సంక్షేమం బీజేపీకి పట్టదని విమర్శించారు. కేవలం ప్రకటనల కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూ.3,044 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఈ మొత్తం నగదుతో ఉత్తరప్రదేశ్ లాంటి వెనుకబడ్డ రాష్ట్రాల్లోని ప్రతీ గ్రామంలో విద్య, వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజలను […]

మోదీ ప్ర‌క‌ట‌న‌ల ఖర్చు రూ. 3044 కోట్లు : మాయావతి
Follow us on

లక్నో :  బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ట్విట్టర్ వేధికగా ప్రధాని మోదీ, బీజేపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రధాని మోదీకి ప్రచారమే ముఖ్యమనీ, ప్రజా సంక్షేమం బీజేపీకి పట్టదని విమర్శించారు. కేవలం ప్రకటనల కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూ.3,044 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఈ మొత్తం నగదుతో ఉత్తరప్రదేశ్ లాంటి వెనుకబడ్డ రాష్ట్రాల్లోని ప్రతీ గ్రామంలో విద్య, వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని మండిపడ్డారు. అందులో భాగంగా పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లిస్తోందన్నారు. కాగా.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 80 స్థానాలకు గానూ బీఎస్పీ 38 స్థానాల్లో, ఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరో మూడు స్థానాలను రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ)కి కేటాయించారు. మిగిలిన అమేథి(రాహుల్ గాంధీ), రాయ్ బరేలీ(సోనియా గాంధీ) సీట్లలో పోటీచేయకూడదని నిర్ణయించారు.