జగన్‌కు షాక్.. అఙ్ఞాతంలో ఆర్కే

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ తగలనుందా అంటూ అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇన్ని రోజులు పార్టీకి సన్నిహితుడిగా ఉంటూ వస్తోన్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేంత ఆర్థిక స్థోమత లేదని ముందు నుంచి చెప్తూ వస్తోన్న ఆర్కే.. తన స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలని కొందరి పేర్లను జగన్ దగ్గర ప్రస్తావించారట. అయితే వారికి కాకుండా […]

జగన్‌కు షాక్.. అఙ్ఞాతంలో ఆర్కే

Edited By:

Updated on: Mar 06, 2019 | 6:33 PM

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ తగలనుందా అంటూ అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇన్ని రోజులు పార్టీకి సన్నిహితుడిగా ఉంటూ వస్తోన్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడనున్నట్లు తెలుస్తోంది.

ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేంత ఆర్థిక స్థోమత లేదని ముందు నుంచి చెప్తూ వస్తోన్న ఆర్కే.. తన స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలని కొందరి పేర్లను జగన్ దగ్గర ప్రస్తావించారట. అయితే వారికి కాకుండా ఒక పద్మశాలీ మహిళకు ఆ సీటును ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారట. దీంతో అసంతృప్తికి గురైన ఆర్కే అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారట. శుక్రవారం నుంచి ఆయన కార్యకర్తలకు కూడా అందుబాటులోకి రాలేదట. దీంతో పార్టీ పదవులకు రాజీనామా చేసిన కొందరు వైసీపీ నేతలు ఆర్కే కోసం నిరీక్షిస్తున్నారట.

అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల మెజార్టీతో ఆర్కే గెలుపొందారు. ఈ సారి ఎలాగైనా భారీ మెజార్టీని దక్కించుకోవాలనుకున్న ఆర్కే గత మూడేళ్లుగా జనాల్లో తిరుగుతూనే ఉన్నారు. పైగా రాజన్న క్యాంటిన్, రాజన్న కూరగాయల మార్కెట్ అంటూ ప్రజలకు చాలా దగ్గరవుతూ వచ్చారు. అయితే ఆర్థిక కారణాల వలన ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటోన్న ఇప్పుడు వైసీపీ దూరం అవ్వడం జగన్‌కు పెద్ద షాక్ అని అంటున్నారు రాజకీయ నిపుణులు.