లోక్‌సభ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలని అనుకోవడం లేదని సీఎం మమత ప్రకటించారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని.. పార్టీ గుర్తు ముఖ్యమని మమతాబెనర్జీ స్పష్టం చేశారు. తాను ఆరు నెలలు పని చేయలేకపోయానని పార్టీకి చెప్పినట్లు ఆమె తెలిపారు. బెంగాల్ రాష్ట్రంలో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకు గానూ తృణమూల్ కాంగ్రెస్ 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 18 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ 2 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది.