రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ప్రతిపక్ష నేతగా కొనసాగిన గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆజాద్ స్థానంలో తమ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే పేరును కాంగ్రెస్ ప్రతిపాదించింది. దీంతో ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆజాద్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు కాంగ్రెస్ పార్టీ సమాచారం అందించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాం నబీ ఆజాద్ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అయితే ఆజాద్ పదవీకాలం ఈ నెల 15తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆజాద్ స్థానంలో ఖర్గే పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఆజాద్‌తో పాటు నజీర్ అహ్మద్ లవాయ్(పీడీపీ) పదవీ కాలం కూడా 15తో ముగియనుంది. ఆజాద్ సేవలను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ.. రాజ్యసభలో భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సభ తరపున ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. దేశంలో గొప్ప అనుభవం ఉన్న నాయకులలో ఖర్గే ఒకరని వెంకయ్య కొనియాడారు. కాగా, రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేటి నుంచి నెల రోజు పాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి.
ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో పాటు పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది. వాటిల్లో ముఖ్యంగా పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు కూడా ఉన్నాయి. త్వరలో దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడీవేడీగా కొనసాగే అవకాశం ఉంది.
కాగా, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. చమురు ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. పెట్రోలు లీటర్‌కు రూ. 100, డిజీల్ లీటర్‌కు రూ. 80 చొప్పున పెరిగిందన్నారు. ఎల్పీజీ ధరలు కూడా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎక్సైజ్ డ్యూటీ పేరిట రూ. 21 లక్షలు వసూలు చేశారని తెలిపారు. పెరిగిన ధరలతో అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఖర్గే పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల తొలిరోజే రాజ్యసభ స్తంభించడం ఆసక్తిగా మారింది. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
Read More:
కొత్తపార్టీపై ఏర్పాటుపై స్పీడ్ పెంచిన షర్మిల.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మరో కీలక అడుగు