బీజేపీ-కాంగ్రెస్‌ కలిసినా మెజారిటీ రాదు: కేటీఆర్

| Edited By:

Mar 16, 2019 | 7:01 PM

గత ఐదేళ్లలో ప్రధాని మోదీ హవా బాగా తగ్గిపోయిందని సిరిసిల్ల ఎమ్మెల్యే…టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈసారి బీజేపీకి 150 కంటే ఎక్కువ సీట్లు రావని చెప్పారు. బీజేపీ-కాంగ్రెస్‌ కలిసినా మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ పరిస్థితి మరీ దిగజారిందన్నారు. అయితే మోదీ, లేదంటే రాహుల్‌ను ఎంచుకోవాల్సిన దుస్థితి ఈ దేశానికి ఎందుకు పట్టాలి అని ఆయన విమర్శించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని […]

బీజేపీ-కాంగ్రెస్‌ కలిసినా మెజారిటీ రాదు: కేటీఆర్
Follow us on

గత ఐదేళ్లలో ప్రధాని మోదీ హవా బాగా తగ్గిపోయిందని సిరిసిల్ల ఎమ్మెల్యే…టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈసారి బీజేపీకి 150 కంటే ఎక్కువ సీట్లు రావని చెప్పారు. బీజేపీ-కాంగ్రెస్‌ కలిసినా మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ పరిస్థితి మరీ దిగజారిందన్నారు. అయితే మోదీ, లేదంటే రాహుల్‌ను ఎంచుకోవాల్సిన దుస్థితి ఈ దేశానికి ఎందుకు పట్టాలి అని ఆయన విమర్శించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని కేటీఆర్ స్పష్టం చేశారు.