నేడు టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన?

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ లోక్‌సభ సభ్యులతో భేటీ అవ్వనున్నారు. వారితో చర్చించిన తరువాత లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తరువాతే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్. కాగా లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన విషయంలో కేసీఆర్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ స్థానాలపై అంతర్గత సర్వే తరువాత అన్ని విషయాలను పరిశీలించి కేసీఆర్ ముందుకెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్ ఒక్క స్థానం మినహా […]

నేడు టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన?

Edited By:

Updated on: Mar 16, 2019 | 8:44 AM

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ లోక్‌సభ సభ్యులతో భేటీ అవ్వనున్నారు. వారితో చర్చించిన తరువాత లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తరువాతే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్.

కాగా లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన విషయంలో కేసీఆర్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ స్థానాలపై అంతర్గత సర్వే తరువాత అన్ని విషయాలను పరిశీలించి కేసీఆర్ ముందుకెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్ ఒక్క స్థానం మినహా రాష్ట్రవ్యాప్తంగా 16 లోక్‌సభ స్థానాల్లో విజయానికి అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసినట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా రావడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టీఆర్‌ఎస్ ఎంపీల జాబితా ప్రకటించనున్నారు. సిట్టింగ్ ఎంపీల్లో గరిష్టంగా ముగ్గురికి మళ్లీ అవకాశం ఉండబోదని తెలుస్తోంది. ఖమ్మం, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ సిట్టింగ్‌లకు తిరిగి అవకాశం ఇచ్చే విషయమై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని సమాచారం.