జ్యోతిరాదిత్య సింధియాకి పార్టీ చాలా ఇచ్చింది: దిగ్విజయ సింగ్

|

Aug 24, 2020 | 3:19 PM

మధ్యప్రదేశ్ బిజెపి నేత జ్యోతిరాదిత్య సింధియాపై రాజ్యసభ ఎంపి దిగ్విజయ సింగ్ విరుచుకుపడ్డారు. పార్టీ తనకు చాలా ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ నుండి జ్యోతిరాదిత్య సింధియా నిష్క్రమించారన్నారు.

జ్యోతిరాదిత్య సింధియాకి పార్టీ చాలా ఇచ్చింది: దిగ్విజయ సింగ్
Follow us on

మధ్యప్రదేశ్ బిజెపి నేత జ్యోతిరాదిత్య సింధియాపై రాజ్యసభ ఎంపి దిగ్విజయ సింగ్ విరుచుకుపడ్డారు. పార్టీ తనకు చాలా ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ నుండి జ్యోతిరాదిత్య సింధియా నిష్క్రమించారన్నారు. సింధియా కాంగ్రెస్ ను విడిచిపెట్టడం ఉహించలేదన్న దిగ్విజయ్.. అతని వల్ల రాజకీయాల్లో విశ్వసనీయతను దెబ్బతీసిందన్నారు.

గ్వాలియర్ లో జరుగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఏత్తున చేరానడంతో దిగ్విజయ్.. సింధియాపై విమర్శలు గుప్పించారు. అయితే, సింధియా పార్టీ నుంచి వైదొలిగిన తరువాత గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో కాంగ్రెస్ మరింత బలపడిందన్నారు దిగ్విజయ్. బిజెపి సభ్యత్వ డ్రైవ్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్, ఆదివారం రాణి లక్ష్మీ బాయి స్మారక చిహ్నం వద్ద ధర్నా కూడా నిర్వహించింది. నిరసనలో పాల్గొన్న దిగ్విజయ సింగ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ సింధియాకు చాలా ఇచ్చిందని.. పార్టీని వీడి సింథియా తప్పుచేశారన్న ఆయన.. ఇది రాజకీయాల్లో విశ్వసనీయతను దెబ్బతీసిందన్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్ఎస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో రెండు రోజుల్లో 35,843 మంది కాంగ్రెస్ నాయకులు, కార్మికులు బిజెపిలో చేరారు అని రాష్ట్ర ఇంధన మంత్రి ప్రధ్యూమాన్ సింగ్ తోమర్ ఆదివారం ఇక్కడ విలేకరులతో అన్నారు. అటు, మొరెనా బరేలాల్ జాతవ్ మాజీ కాంగ్రెస్ ఎంపి, గ్వాలియర్ గ్రామీణ నియోజకవర్గం మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్‌వరన్ గుర్జార్ ఆదివారం బిజెపిలో చేరారు.