ఎన్నికల ప్రచార సభలో బోరుమన్న జయప్రద

రాంపూర్: పాత తరం సినిమా అందాల తార, రాజకీయ నాయకురాలు జయప్రద బోరుమన్నారు. ఎన్నికల ప్రచార సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో కన్నీళ్లు ఆపుకోలేక మాట్లాడుతూ.. తనను సమాజ్ వాదీ పార్టీ నేత ఆజాం ఖాన్ తీవ్ర వేధింపులకు గురిచేశారని చెప్పారు. రాంపూర్‌ను వదలిపెట్టి వెళ్లకపోతే యాసిడ్ పోస్తానంటూ బెదిరించారని జయప్రద వెల్లడించారు. సమాజ్ వాదీ పార్టీలో చేదు అనుభవాలు చూసిన తరువాత జయప్రద బీజేపీలో చేరి.. రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని […]

ఎన్నికల ప్రచార సభలో బోరుమన్న జయప్రద

Edited By:

Updated on: Apr 04, 2019 | 7:52 PM

రాంపూర్: పాత తరం సినిమా అందాల తార, రాజకీయ నాయకురాలు జయప్రద బోరుమన్నారు. ఎన్నికల ప్రచార సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో కన్నీళ్లు ఆపుకోలేక మాట్లాడుతూ.. తనను సమాజ్ వాదీ పార్టీ నేత ఆజాం ఖాన్ తీవ్ర వేధింపులకు గురిచేశారని చెప్పారు. రాంపూర్‌ను వదలిపెట్టి వెళ్లకపోతే యాసిడ్ పోస్తానంటూ బెదిరించారని జయప్రద వెల్లడించారు.

సమాజ్ వాదీ పార్టీలో చేదు అనుభవాలు చూసిన తరువాత జయప్రద బీజేపీలో చేరి.. రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున లోక్ సభకు పోటీచేస్తున్నారు.