తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత ఇంటిని స్మారకంగా మార్చారు. తమిళనాడు రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆ స్మారకాన్ని ప్రారంభించారు. కోర్టు ఆదేశాల ప్రకారం స్మారకంలోకి ప్రజలను అనుమతించనున్నారు. కానీ ప్రభుత్వం ఆ ఇంటి తాళాలు మాత్రం కోర్టు వద్దే ఉండనున్నాయి. కాగా… జయలలిత వారసులు జే దీప, జే దీపక్‌లు.. పోయెస్ గార్డెన్ ఇంటిని స్మారకంగా మారుస్తామని గతంలో కోర్టులో సవాల్ చేశారు. అయితే ఈ కేసులో జస్టిస్ ఎన్ శేషసాయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జయ ఇంటిని స్మారక కేంద్రంగా ప్రకటించిన తర్వాత ఆ ఇంటి తాళాలు జిల్లా కలెక్టర్ లేదా ఏదైనా అధికారి వద్ద ఉంటాయని కోర్టు చెప్పింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం మళ్లీ ఈ కేసులో వాదనలు జరగనున్నాయి. మరో వైపు మెరీనా బీచ్‌లో ఫీనిక్స్ ఆకారంలో నిర్మించిన జయ స్మారకాన్ని సీఎం పళనిస్వామి ప్రారంభించారు.