Pawan kalyan: స్పీడు పెంచిన సేనాని.. అక్టోబరు 5 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయదశమి రోజున తిరుపతి నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది.

Pawan kalyan: స్పీడు పెంచిన సేనాని.. అక్టోబరు 5 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన..
Pawan Kalyan

Updated on: Jun 10, 2022 | 7:19 PM

Janasena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమర శంఖం పూరించారు. ఇకపై జనాల్లోనే ఉండనున్నారు. పవన్‌ కల్యాణ్‌ త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటన చేయబోతున్నారు. అక్టోబరు 5న తిరుపతి నుంచి సేనాని యాత్ర ప్రారంభం కానుంది. విజయదశమి నుంచి జిల్లాల పర్యటనకు పవన్‌కల్యాణ్‌ అండ్ టీమ్ రూట్ మ్యాప్ కూడా రెడీ అయిపోయింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా పవన్‌ ప్రచారం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటన ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.   6నెలల్లో రాష్ట్రమంతా పర్యటన, ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని జనసైనికులు సిద్ధంగా ఉండాలని  నాదెండ్ల మనోహర్ సూచించారు.  ఇప్పటి వరకూ అంగీకరించిన సినిమాల షూటింగ్స్ ను అక్టోబర్ వరకూ కంప్లీట్ చేసి .. అప్పట్నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండాలని పవన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పవన్ పర్యటనపై జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు కూడా స్పందించారు. తిరుపతి నుంచి అక్టోబర్ 5న విప్లవం ప్రారంభమవుతుందన్నారు.

 

ఇటీవల కాలంలో ఏపీలో పొత్తుల గురించి.. ఓ రేంజ్‌లో చర్చ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ ప్రకటించడంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఈసారి టీడీపీ కాస్త వెనక్కి తగ్గి.. తమకు ప్రాధాన్యం ఇస్తే బెటరన్న వ్యాఖ్యలు కూడా ఆయన నుంచి వినిపించాయి. దీంతో పొత్తుల వెర్షన్స్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాయి. ఈ చర్చ నడుస్తుండగానే  “జర బద్రం” పేరుతో ప్రజలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించినట్లుగా ఇటీవల పవన్ చేసిన ఓ ట్వీట్  చర్చనీయాంశంగా అయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి