పవన్‌ అలా కాదు.. జగన్‌ గురించి చెప్తూ రాపాక భావోద్వేగం

| Edited By:

Jun 25, 2020 | 8:39 PM

జనసేన తరఫున గెలిచినప్పటికీ మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు పలుకుతూ వస్తున్నారు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.

పవన్‌ అలా కాదు.. జగన్‌ గురించి చెప్తూ రాపాక భావోద్వేగం
Follow us on

జనసేన తరఫున గెలిచినప్పటికీ మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు పలుకుతూ వస్తున్నారు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఈ క్రమంలో ఆయనను తమ ఎమ్మెల్యే అని జనసేన కూడా చెప్పుకోవడం మానేసింది. అంతేకాదు సోషల్ మీడియాలో జనసైనికులు రాపాకకు వ్యతిరేకంగా ట్వీట్లు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని పక్కన పెడితే తాజాగా జగన్‌ గురించి మాట్లాడుతూ రాపాక భావోద్వేగానికి గురయ్యారు. జగన్‌- పవన్‌కి చాలా తేడా ఉంది అంటూ ఆయన అన్నారు.

కాపు నేస్తం నిథుల విడుదల కార్యక్రమంలో భాగంగా బుధవారం తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులు, ప్రభుత్వాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాపాకను ‘అన్న’ అని సంభోదించారట జగన్. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు ఉన్నా జగన్ తనను ‘అన్న’ అని పిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారట. పవన్ ఇంతవరకు తనను అంత ప్రేమతో, ఆప్యాయతతో పిలవలేదని రాపాక పేర్కొన్నారట. అంతేకాదు ఈ విషయాన్ని తన అభిమానులు, కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలతో చెప్పిన రాపాక భావోద్వేగానికి గురయ్యారట. అంత ప్రేమగా పిలిచే ముఖ్యమంత్రులు కూడా దేశంలో ఉండరని రాపాక చెప్పుకొచ్చారట.

Read This Story Also: స్విస్ బ్యాంకులో తగ్గుతున్న భారతీయుల డిపాజిట్లు