హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విడుదల చేశారు. ఈ తొలి జాబితాలో తొమ్మిది మంది పేర్లు ఉన్నాయి. మిగతావారి పేర్లలో కొంతమందిని రెండో జాబితా ద్వారా విడుదల చేయనున్నారు. ఆ రెండో జాబితాను ఆదివారం ఇడుపులపాయలో ప్రకటించే అవకాశం ఉంది.
తొలి జాబితాలో ఉన్న ఆ తొమ్మిది మంది పేర్లు
బాపట్ల – నందిగం సురేష్, హిందుపురం – గోరంట్ల మాధవ్, అరకు – గొడ్డేటి మాధవి, రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అమలాపురం- చింతా అనురాధ, కర్నూలు – డాక్టర్ సంజీవ్ కుమార్, కడప- వైఎస్ అవినాష్ రెడ్డి, అనంతపురం – తలారి రంగయ్య, చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప.