ఏపీలో సీబీఐ విచారణకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వం సీబీఐని నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేసిన జగన్ సర్కార్. రాష్ట్రంలో సీబీఐ విచారణకు సాధారణ సమ్మతిని పునరుద్ధరిస్తూ ఏపీ హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేశారు జగన్. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ సాధారణ సమ్మతిని పునరుద్ధరించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.