మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్రాస్ రోడ్ లో ఉన్నారా..ఏ దారికి వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా..అంటే
అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని పొగుడుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. అయితే పార్టీ మారుతారని అంతా ఊహించినా అలాంటిదేమి జరగలేదు. బీజేపీలోకి వెళ్తానంటూ స్టేట్ మెంట్లు మాత్రం ఇచ్చాడు. ఇతని తర్వాత స్టేట్ మెంట్లు ఇచ్చిన నేతలంతా ఇప్పటికే కమలం గూటికి చేరిపోయారు. మరీ రాజగోపాల్ రెడ్డి దారెటో అర్థం కాక ఆయన క్యాడర్ అంతా అయోమయం చెందుతున్నారట.
ఇక కాంగ్రెస్ పనైపోయింది..బీజేపీనే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమంటూ కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డి..ఇప్పుడు అటు బీజేపీలో చేరకుండా..ఇటు కాంగ్రెస్ తో కలిసుండకుండా ఒంటరిపోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా బీజేపీలో చేరితే తన పదవికి ఇబ్బంది తప్పదని భావిస్తున్న కోమటిరెడ్డి ఇంకా వెయిట్ అండ్ సీ ధోరణిలోనే ఉన్నారట. మరికొందరు ఎమ్మెల్యేలు కలిసివస్తే విలీనం చేస్తే బాగుంటుందనేది రాజగోపాల్ ప్లానటా. అందుకే అలాంటి టైం ఏదైనా వస్తుందా అని వేచి చూస్తున్నారట కోమటిరెడ్డి.
2024లో బీజేపీదే అధికారమంటూ పదే పదే కామెంట్స్ చేస్తున్న కోమటిరెడ్డి ఎందుకు ఇప్పటి వరకు బీజేపీలో చేరలేదు. ఎవరి కోసమైనా వెయిటింగ్ చేస్తున్నారా..అనేది ఇప్పడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.