నేను ఓడిపోతే అలా చేస్తా: చంద్రబాబు

మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గనక ఈ ఎన్నికల్లో ఓడిపోతే భార్య, కుమారుడు, మనవడితో గడుపుతానని చెప్పారు. అయితే మరి మోడీ ఓడిపోతే ఎవరితో కాలం గడుపుతారని ప్రశ్నించారు. కుటుంబ వ్యవస్థంటే ఏంటో మోడీకి తెలియదని చంద్రబాబు విమర్శించారు. తన ఒంటిపై బంగారం ఉండదని, వాటిపై తనకు ఆశ కూడా లేదని, ప్రజా సేవ చేయాలన్నదే తన అభిమతమని అన్నారు. శాకాహారం […]

నేను ఓడిపోతే అలా చేస్తా: చంద్రబాబు

Updated on: Apr 03, 2019 | 9:41 AM

మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గనక ఈ ఎన్నికల్లో ఓడిపోతే భార్య, కుమారుడు, మనవడితో గడుపుతానని చెప్పారు. అయితే మరి మోడీ ఓడిపోతే ఎవరితో కాలం గడుపుతారని ప్రశ్నించారు. కుటుంబ వ్యవస్థంటే ఏంటో మోడీకి తెలియదని చంద్రబాబు విమర్శించారు. తన ఒంటిపై బంగారం ఉండదని, వాటిపై తనకు ఆశ కూడా లేదని, ప్రజా సేవ చేయాలన్నదే తన అభిమతమని అన్నారు. శాకాహారం మాత్రమే తింటానని, అది కూడా తక్కువేనని చంద్రబాబు చెప్పారు.