సీబీఐ విచారణ వేయకపోతే కోర్టుకెళతాం: జగన్

|

Mar 16, 2019 | 5:21 PM

హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో గవర్నర్ నరసింహన్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని కోరినట్టు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదని, చంద్రబాబుకు రిపోర్ట్ చేసే పరిస్థితి లేని విచారణ జరగాలని జగన్ అన్నారు. అందుకే సీబీఐ విచారణ జరగాలని, లేకపోతే తాము కోర్టును ఆశ్రయించడానికి కూడా వెనకాడబోమని జగన్ వెల్లడించారు. తన చిన్నాన్న హత్య కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు […]

సీబీఐ విచారణ వేయకపోతే కోర్టుకెళతాం: జగన్
Follow us on

హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో గవర్నర్ నరసింహన్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని కోరినట్టు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదని, చంద్రబాబుకు రిపోర్ట్ చేసే పరిస్థితి లేని విచారణ జరగాలని జగన్ అన్నారు. అందుకే సీబీఐ విచారణ జరగాలని, లేకపోతే తాము కోర్టును ఆశ్రయించడానికి కూడా వెనకాడబోమని జగన్ వెల్లడించారు.

తన చిన్నాన్న హత్య కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు ఒప్పుకోవడంలేదని జగన్ ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ టీడీపీ వాచ్‌మెన్‌లా మారిపోయిందని.. ఎస్పీ, డీఐజీలతో తాము మాట్లాడుతుండగానే ఏబీ వెంకటేశ్వర రావు ఫోన్లు చేసి వారితో చాలాసేపు మాట్లాడారని, కచ్చితంగా ఆయన హస్తం కూడా ఉందని జగన్ ఆరోపించారు.