
వయనాడ్ : ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ.. పార్టీ అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయంగా ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం కేరళలో ప్రచార బిజీలో ఉన్న ఆమె.. పార్టీ ఆదేశిస్తే వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి రెడీ అని అన్నారు. పార్టీ అధ్యక్షుడు, తన సోదరుడు రాహుల్ గాంధీ తనను ఈ మేరకు కోరితే.. తప్పకుండా ఆ నియోజకవర్గంలో ప్రధాని మోదీపై బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.