లక్ష్మీ పార్వతి అలా చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: బుద్ధా వెంకన్న

విజయవాడ: గురువుకే పంగనామాలు పెట్టినవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన మోహన్ బాబు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు నిజాయితీ పరుడు, ఆయన ఎన్టీఆర్‌కు భక్తుడు, చనిపోయే వరకూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచారు అని లక్ష్మీపార్వతి చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. అయితే ఇందుకు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఎన్టీఆర్‌కు మోహన్ బాబు రామభక్తుడని అన్నారు. అయితే చంద్రబాబు పెట్టిన ప్రలోభాల […]

లక్ష్మీ పార్వతి అలా చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: బుద్ధా వెంకన్న

Updated on: Apr 03, 2019 | 7:47 AM

విజయవాడ: గురువుకే పంగనామాలు పెట్టినవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన మోహన్ బాబు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు నిజాయితీ పరుడు, ఆయన ఎన్టీఆర్‌కు భక్తుడు, చనిపోయే వరకూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచారు అని లక్ష్మీపార్వతి చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.

అయితే ఇందుకు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఎన్టీఆర్‌కు మోహన్ బాబు రామభక్తుడని అన్నారు. అయితే చంద్రబాబు పెట్టిన ప్రలోభాల వల్లనే చివరిలో ఎన్టీఆర్‌ను వీడి చంద్రబాబు వైపుకు వెళ్లారని చెప్పారు. ఇష్టం లేక వెళ్లినప్పటికీ మోహన్ బాబు మనసు మాత్రం ఎన్టీఆర్‌తోనే ఉందని అన్నారు. హెరిటేజ్‌లో పెట్టుబడి పెట్టిన మోహన్‌బాబుకు నష్టాలు చూపించి ఏమీ ఇవ్వలేదని, కానీ ఆ సంస్థను మాత్రం తన భార్య పేరు మీద రాసేశారని చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి ఆరోపణలు చేశారు.