జగన్‌కు నా ఉడతా సాయం..!

| Edited By:

May 24, 2019 | 6:17 PM

ఏపీలో ఘనవిజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు నటుడు మంచు మోహన్ బాబు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాముల వారి సారధికి ఉడత సహాయం చెసినట్టు నా వంతు నేను వైఎస్ జగన్‌కు సహాయమందించానన్నారు. జగన్ సీఎం కావాలని ప్రజల తీర్పునిచ్చారని, ఆయన పాదయాత్రతోనే అందరితోనూ మమేకమయ్యారని మోహన్ బాబు పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుణాలు జగ‌న్‌లోనూ కనిపించాయి.. అందునే నేను కూడా మద్దతిచ్చా. నాన్న బాటలో నడిచిన […]

జగన్‌కు నా ఉడతా సాయం..!
Follow us on

ఏపీలో ఘనవిజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు నటుడు మంచు మోహన్ బాబు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాముల వారి సారధికి ఉడత సహాయం చెసినట్టు నా వంతు నేను వైఎస్ జగన్‌కు సహాయమందించానన్నారు. జగన్ సీఎం కావాలని ప్రజల తీర్పునిచ్చారని, ఆయన పాదయాత్రతోనే అందరితోనూ మమేకమయ్యారని మోహన్ బాబు పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుణాలు జగ‌న్‌లోనూ కనిపించాయి.. అందునే నేను కూడా మద్దతిచ్చా. నాన్న బాటలో నడిచిన జగన్‌.. ప్రజలకు మంచి చేయాలని ఆశిస్తున్నాను. ఎన్నో కష్టాల్ని ఓర్చుకొని జగన్ ఈ విజయం సాధించారని మోహన్ తెలిపారు. అలాగే.. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నాకు చాలా సన్నిహితుడు, మిత్రుడైన అంబరీష్ భార్య సుమలత కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు మోహన్ బాబు.