జీ హుజూర్.. ఆ ఇద్దరికే అక్కడ టెన్షన్ !

జీ హుజూర్.. ఆ ఇద్దరికే అక్కడ టెన్షన్ !

అక్టోబర్ 21న జరగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నేతలందరినీ ఏమో గానీ ఆ ఇద్దరు గులాబీ నాయకులను తెగ టెన్షన్‌కు గురిచేస్తోందట. ఏం చేస్తారో తెలియదు అక్కడ గెలవాల్సిందేనని అధినేత హుకుం జారీ చేయడంతో గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న ఆ ఇద్దరు గులాబీ నేతలు.. గెలుపు కోసం రాత్రింబవళ్ళు తెగ కష్టపడిపోతున్నారట. ఇంతకీ ఆ ఇద్దరెవరు అనే కదా సందేహం.. రీడ్ దిస్ స్టోరీ… తెలంగాణ కాంగ్రెస్ సారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన […]

Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Oct 18, 2019 | 6:58 PM

అక్టోబర్ 21న జరగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నేతలందరినీ ఏమో గానీ ఆ ఇద్దరు గులాబీ నాయకులను తెగ టెన్షన్‌కు గురిచేస్తోందట. ఏం చేస్తారో తెలియదు అక్కడ గెలవాల్సిందేనని అధినేత హుకుం జారీ చేయడంతో గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న ఆ ఇద్దరు గులాబీ నేతలు.. గెలుపు కోసం రాత్రింబవళ్ళు తెగ కష్టపడిపోతున్నారట. ఇంతకీ ఆ ఇద్దరెవరు అనే కదా సందేహం.. రీడ్ దిస్ స్టోరీ…

తెలంగాణ కాంగ్రెస్ సారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం ప్రకటించింది మొదలు అక్కడే మకాం వేసిన నేతలిద్దరు. వారిలో ఒకరు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కాగా.. మరొకరు తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాల్సిందేనని దిశానిర్దేశం చేసిన గులాబీ దళపతి కెసీఆర్.. విజయం సాధించిన వార్తతోనే తనను కల్వాలని ఆర్దరేసినట్లు సమాచారం.

కెసీఆర్ ఆదేశాలతో హుజూర్‌నగర్‌కు బయలుదేరిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలు ఒక్క నియోజకవర్గాన్నిగెలవలేమా అన్న ధీమాలో తొలి రోజుల్లో కనిపించారు. కానీ రాన్రాను పరిస్థితిలో వచ్చిన మార్పులు.. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె లాంటి అంశాలతో తెగ టెన్షన్ పడిపోతున్నారట. ఆర్టీసీ సమ్మెకంటే ముందు విజయం నల్లేరు మీద నడకే అని వ్యాఖ్యానించిన ఈ ఇద్దరు నేతలు ఇపుడు అంత కాన్పిడెంట్‌గా కనిపించకపోవడంతో వీరిద్దరి టెన్షన్ బహిర్గతమైందని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. 

మండలానికి ఒక రాష్ట్ర స్థాయి నేతని నియమించి, గల్లీ గల్లీ ఓటర్లకు హిత బోధ చేస్తున్నటిఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ సమ్మె ఎక్కడ దెబ్బ కొడుతుందోనన్న టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. అయితే పైకి మాత్రం డాంబికంగా కనిపిస్తూ అనుకూల విశ్లేషణలు చెబుతున్నట్లు సమాచారం. నిజానికి గతంలో మహాకూటమి తరపున పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ పార్టీల ఉమ్మడి ఓట్లతో గెలుపొందారు. కానీ ఈసారి ఉప ఎన్నికలో ఉత్తమ్ కుమార్ సతీమణి పద్మావతి పోటీ చేస్తుండగా.. టిడిపి, సిపిఐ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడం లేదు. టిడిపి సొంతంగా అభ్యర్థిని రంగంలోకి దింపి పరోక్షంగా టిఆర్ఎస్ నెత్తిన పాలుపోసింది.

సిపిఐ నేతలు ఆడిన మాట తప్పి నియోజకవర్గంలో చులకనైపోయారు. ముందుగా టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతు ప్రకటించి.. ఆ తర్వాత ఆర్టీసీ సమ్మె సాకుతో విరమించుకున్నారు. ప్రస్తుతం వారు న్యూట్రల్‌గా వున్నారు. టిజెఎస్ కోదండరామ్ కాంగ్రెస్ అభ్యర్థినికి మద్దతు ఇస్తున్నా పెద్దగా ప్రచారం చేయలేదు. మరోవైపు బిజెపి అభ్యర్థి కూడా బరిలో వున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గణనీయంగా చీలే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఈ అంచనాలతో, విశ్లేషణలతో టిఆర్ఎస్  విజయం సాధించి తీరుతుందని గులాబీ శ్రేణులు పలుమార్లు చెప్పుకున్నాయి.

మరి ఇంత కాన్పిడెంట్‌గా వున్న గులాబీ శ్రేణుల్లో మరీ ముఖ్యంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలలో సడన్‌గా ఎందుకు టెన్షన్ అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu