Huzurabad: హుజూరాబాద్‌లో ఇంటెలిజెన్స్‌ వర్గాల మకాం .. నోటిఫికేషన్ మీద భారీ సస్పెన్స్‌

|

Sep 11, 2021 | 9:41 PM

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న హుజూరాబాద్‌

Huzurabad: హుజూరాబాద్‌లో ఇంటెలిజెన్స్‌ వర్గాల మకాం .. నోటిఫికేషన్ మీద భారీ సస్పెన్స్‌
Huzurabad
Follow us on

Huzurabad By election: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భారీగా ఇంటెలిజెన్స్‌ వర్గాలు మకాం వేశాయి. ప్రధాన రాజకీయ పార్టీల కదలికలు, ఆ పార్టీల విషయంలో ప్రజా అభిప్రాయాన్ని అంచనా వేయడంలో నిమగ్నమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీ ‘గ్రాఫ్‌’ఎలా ఉందో లెక్కలు కడుతున్నాయి. హుజూరాబాద్ ఎన్నికలకు టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ ఓ రివ్యూ పెట్టుకుని కసరత్తు చేస్తోంది. ఇటు బీజేపీ నుంచి ఈటల పేరు కూడా త్వరలో బయటకువచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ రేపో మాపో వస్తుందీ అనుకున్న ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ అసలు వస్తుందా రాదా అన్నదే సస్పెన్స్‌గా మారింది.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రధాన రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. వివిధ కారణాల దృష్ట్యా అయా రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన ఉప ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను కోరుతూ అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అయా పార్టీల అభిప్రాయాలను వెల్లడించాల్సిందిగా కోరింది.

కరోనా ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు చేసిన వినతిని దృష్టిలో ఉంచుకొని 31 అసెంబ్లీ స్థానాల్లో, మూడు పార్లమెంటరీ స్థానాల్లో ఎన్నికలను సీఈసీ వాయిదా వేసింది. దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గం ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. వరదలు, పండుగలు, కోవిడ్ మహమ్మారి కారణంగా ఉప-ఎన్నికలు ఇప్పుడే నిర్వహించవద్దని తెలంగాణ సహా 11 రాష్ట్రాలు కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించాయి. పండుగల సీజన్ తర్వాతే ఉప-ఎన్నికలు నిర్వహించాలని ఆయా రాష్ట్రాలు సూచించిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. పండుగల అనంతరం హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Read also:  Seema Politics: సీమ టీడీపీ నేతల సదస్సుకు వైసీపీ కౌంటర్.. కమ్మభవన్‌లో నిర్వహించడం పై మీ ఆంతర్యం ఏంటని ప్రశ్న