టీడీపీ తరపున‌ హీరో నిఖిల్ ప్రచారం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారానికి ఐదు రోజుల సమయమే ఉండటంతో దూకుడు పెంచాయి పార్టీలు. సినిమా స్టార్లను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ తరపున సీమ జిల్లాల్లో హీరో నిఖిల్ ప్రచారం చేస్తున్నారు. గురువారం కర్నూలు జిల్లా డోన్, పత్తికొండతో పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఏపీ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు సినీ హీరో నిఖిల్. టీడీపీ ఐదేళ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలకు […]

టీడీపీ తరపున‌ హీరో నిఖిల్ ప్రచారం

Updated on: Apr 05, 2019 | 8:57 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారానికి ఐదు రోజుల సమయమే ఉండటంతో దూకుడు పెంచాయి పార్టీలు. సినిమా స్టార్లను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ తరపున సీమ జిల్లాల్లో హీరో నిఖిల్ ప్రచారం చేస్తున్నారు. గురువారం కర్నూలు జిల్లా డోన్, పత్తికొండతో పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.

ఏపీ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు సినీ హీరో నిఖిల్. టీడీపీ ఐదేళ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాయని.. మరోసారి ఓటు వేయాలని కోరారు. బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు, దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని.. మంచి పనులు చేసిన ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. డోన్‌లో టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని నిఖిల్‌ కోరారు.

Loading...
Unable to load recommendations.
Follow Us