ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మోజార్టీ సాధించిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ భారీ విజయానికి టీడీపీ చేసిన తప్పులే కారణమని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే.. సానుకూలంగా స్పందించడం మానేసి.. ఆ ఘటనపై టీడీపీ నేతలు రాద్ధాంతాలు చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ పాల్పడిన కుట్రా రాజకీయాల వల్ల వారే ఓటమి చెందారని విమర్శించారు ఆయన.
అలాగే.. ప్రధాని నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మోదీని ఇంత మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. బీజేపీ విజయం ఓ చరిత్రని అన్నారు. ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారంటే మోదీ కృషే కారణమన్నారు. మోదీతో ఎవరు జట్టు కట్టినా విజయం సాధిస్తారని అన్న విషయం స్పష్టమైందని జీవీఎల్ పేర్కొన్నారు.